Homeహైదరాబాద్latest Newsచిన్నారి తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

చిన్నారి తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. సీఎం చంద్రబాబు..చిన్నారి తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు.చిన్నారిపై అత్యాచారం జరిగిందన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img