సోషల్ మీడియా పోస్టులపై ఏపీ కేబినెట్లో కీలక చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులపై చర్చను లేవనెత్తారు. కొందరు వైసీపీ నేతలు పదే పదే పోస్టులు పెడుతున్నారు. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కొందరు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు విధేయులుగా ఉన్న కొందరు అధికారులు ఇప్పటికీ కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ఇలా ఉంటే ఎలా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కొంతమంది ఎస్పీలకు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. కింది స్థాయిలో డీఎస్పీలు, సీఐలు మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ల గురించి పోస్ట్ పెడితే ఓకేనా?… అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు.. గత ప్రభుత్వం పోలీసులు ఇలా ఇలా తయారయ్యారు.. అన్నీ సరిచేయాలి. నెల రోజుల్లోనే పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని అన్నారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.