Homeహైదరాబాద్latest Newsఏపీ విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీ విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ పై ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడంపై సమీక్ష నిర్వహించారు. కుసుమ పథకం, సోలార్ విలేజ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడారు.ఈ ఒప్పందంలో భాగంగా 2025 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్యానెళ్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమీక్షకు పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img