నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఛాతీలో బాణం దిగి కొట్టుమిట్టాడుతున్న యువకుడిని వైద్యులు రక్షించారు. ‘గిరిజన యువకుడు నంద ఛాతీలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నైపుణ్యంతో తొలగించి నిండు ప్రాణాలు కాపాడారు. వైద్యులకు నా అభినందనలు. ప్రజల్లో నిమ్స్ ఆస్పత్రిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలి’ అని X లో CM పోస్ట్ చేశారు.