Homeహైదరాబాద్#TNVS : సీఎంకు కొడుకుపై ఉన్న ప్రేమ విద్యపై లేదు

#TNVS : సీఎంకు కొడుకుపై ఉన్న ప్రేమ విద్యపై లేదు

Chief Minister KCR has been given postcards to appoint Vice Chancellors (VCs) to universities in the state under the auspices of Telangana Navnirman Vidyarthi Sena (TNVS) at Osmania University.

ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన (TNVS) ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయలకు ఉప‌కుల‌ప‌తు(VC)లను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్టు కార్డులు వేశారు.

ఈ సందర్భంగా TNVS OU JAC అధ్యక్షుడు టీకే శివప్రసాద్ మాట్లాడుతూ యూనివర్సిటీలలో వీసీల పదవి ముగిసి ఇప్పటికి 13 నెలలు దాటినా వీ‌సీలను నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని శివ‌ప్ర‌సాద్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయలలో ఇప్పటికే వీ‌సీలు లేక అంధకారంలో నడుస్తున్నాయన్నారు.

ముఖ్యమంత్రికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ విశ్వవిద్యాలయలపైన లేదు, ఉద్యమానికి ఊపిరి పోసిన విశ్వవిద్యాలయాలని నేడు ఊపిరి తీయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ విశ్వవిద్యాలయల నిర్లక్ష్యం వెనుక ప్రైవేటు యూనివర్సిటీల యాజమాన్యం కుట్ర‌ ఉంద‌న్నారు. ఉన్నతమైన విద్య పేద విద్యార్థులకు అందకూడదు అనే భావనతో ప్రభుత్వ విశ్వవిద్యాలయలను నిర్లక్ష్యం చేస్తున్నార‌న్నారు.

విశ్వవిద్యాలయలకు వీ‌సీలను నియమించే వరకు తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్థి సేన (TNVS) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో TNVS గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చింతల పవన్ హైదరాబాద్ ఇంచార్జి దుర్గ ప్రసాద్, TPTLS కొండ రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి విష్ణు హైదరాబాద్ ఉపాధ్యక్షుడు సాహిథ్, వేణు లింగం గౌతమ్ భరత్ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img