Homeహైదరాబాద్latest Newsషర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్

షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్

ఏపీ ఎన్నికల రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠంగా సాగుతున్నాయి. గురువారం సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానంకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు వివేకా హత్య కేసు విషయంలో జగన్ కౌంటర్ ఇచ్చారు. నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీఒక్కరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందులలో ఏం ఉంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు. వైఎస్ వారసులెవరో ప్రజలే చెప్పాలన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకులతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ఆర్ వారసులు అంటూ షర్మిలను ఉద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డనైన నాకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేందుకు కాదు.. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు.. పేదలందరికీ మంచి చేసేందుకు మాత్రమే. ఆ పేదలకు మేలు చేసేందుకు ఈ ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని పక్కన పెట్టాడని మాట్లాడుతున్న నా బంధువులకు చెబుతున్నా అని జగన్ అన్నారు.

Recent

- Advertisment -spot_img