- రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం
- మేం అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు
- సీఎం జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంది
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఇదేనిజం, ఏపీబ్యూరో : ప్రశ్నించే దళితులను ఊచకోత కోస్తూ రాక్షసానందం పొందుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం ఆయన కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. తనది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదుని, తన పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ వారంత పిల్ల సైకోలని, వారు నన్నేమీ చేయలేరన్నారు. ఏ అధికారులైతే జగన్ మాట విన్నారో, వాళ్లంతా ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు చేశారని, జైలులో చంద్రబాబును చూసి పవన్ కూడా బాధపడ్డారన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ మెమోలు కూడా ఇస్తున్నారన్నారు. వారంత మరో మూడు నెలలు ఓపిక పట్టాలని లోకేశ్ కోరారు. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని, విషపూరితమైన మందును సీఎం జగన్ మోహన్‌రెడ్డి అమ్ముతూ డబ్బులు దోచుకుంటున్నాడన్నారు. నకిలీ మందును అమ్ముతున్న పాపం జగన్‌రెడ్డిని ఊరికే వదిలిపెట్టదని హెచ్చరించారు.