HomeరాజకీయాలుCM JAGAN : చంద్రబాబు హయాంలో స్కామ్​లు తప్ప స్కీమ్​లు లేవు

CM JAGAN : చంద్రబాబు హయాంలో స్కామ్​లు తప్ప స్కీమ్​లు లేవు

– ఏపీ సీఎం వైఎస్ జగన్

ఇదే నిజం, ఏపీ బ్యూరో: టీడీపీ పాలనలో స్కామ్​లు తప్ప స్కీమ్​లు లేవని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మంగళవారం పుట్టపర్తి జిల్లాలో రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. చంద్రబాబు ఏనాడూ ప్రజలు, పేదవాడి గురించి ఆలోచించలేదని విమర్శించారు. ‘చంద్రబాబు హయంలో స్కాంలు తప్ప స్కీమ్‌లు గుర్తుకు రావు. బాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్‌లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబు పదవి కావాలి. చంద్రబాబు పాలనలో ప్రజలు, పేదలు, వృద్ధులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు. బాబు పాలనలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించి పాలన జరిగింది’అని జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Recent

- Advertisment -spot_img