ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి జనాల్లో తిరుగుతున్నారు. యాత్ర ముగిశాక రాష్ట్రంలో మొత్తం వంద సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి హెల్లికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు.