HomeతెలంగాణCm kcr:సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Cm kcr:సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Cm kcr:ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసిఫాబాద్‌లో వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న ఆయన ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కుమ్రంభీం చౌరస్తాలో కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు;

ఆ తర్వాత కలెక్టరేట్‌లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలోకి సీఎం కేసీఆర్‌ అడుగుపెట్టగానే పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం.. కలెక్టర్‌ను ఆయన సీట్లో కూర్చోబెట్టారు. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కలెక్టర్‌.. సీఎం శాలువా కప్పి సన్మానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఓ చిత్రపటాన్ని బహూకరించారు

Recent

- Advertisment -spot_img