Homeఫ్లాష్ ఫ్లాష్CM KCR:డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు:సీఎం కేసీఆర్

CM KCR:డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు:సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై బీఆర్ఎస్ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స‌ర్వేల‌న్నీ మ‌న‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌లు అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని, ఆ లోపు ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్ర‌లు చేయాల‌ని చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని సూచించారు.లంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ముచ్చటే లేదు. డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.. దాని ప్రకరామే ప్లాన్ చేసుకోండి. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలి. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించండి. కచ్చితంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. ఏప్రిల్-27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది అని సమావేశంలో నేతలకు కేసీఆర్ క్లియర్‌కట్‌గా చెప్పేశారు. మొత్తానికి చూస్తే చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలపై వస్తున్న ప్రచారాన్ని ఒక్క మాటతో కేసీఆర్ తిప్పికొట్టారు. అంతేకాదు.. ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కారించాలని కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ఇక నుంచి నేతలంతా ప్రజల్లోనే ఉండాలని.. అవసరమైతే పాదయాత్రలు కూడా చేసుకోవాలని నేతలకు గులాబీ బాస్ సలహా ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img