Homeతెలంగాణఈ బిల్లుతో రైతులకు నష్టమే.. సీఎం కేసీఆర్​

ఈ బిల్లుతో రైతులకు నష్టమే.. సీఎం కేసీఆర్​

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు దళారీలకు అనుకూలంగా ఉందని, ఆ బిల్లులు ఆమోదం పొందితే రైతంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని సీఎం కేసీఆర్​ అన్నారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాలని, వ్యతిరేకంగా ఓటును వేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. ఈ బిల్లులను ఎందుకు వ్యతిరేకించాలో కేసీఆర్ వివరించారు. రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో ఉందని, కానీ వాస్తవంగా ఈ నిబంధన దళారీలకు, కార్పొరేట్​ కంపెనీలకు అనుకూలంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా దోచుకునేందుకు ప్రైవేట్​ వ్యాపారులకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఈ బిల్లులను తెచ్చినట్లు కేసీఆర్​ విమర్శించారు. దేశంలో సన్నకారు రైతులే అధికమని, తమ కొద్ది పంటను లారీల్లో ఛార్జీలు పెట్టి తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో అమ్మడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మన దేశంలోనే మక్కలు అధికంగా పండుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మక్కల దిగుమతులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 15 శాతానికి ఎందుకు తగ్గించారని కేసీఆర్​ విమర్శించారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయం అని దుయ్యబట్టారు. దేశంలోని రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లులను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్​ సూచించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img