Homeతెలంగాణవిద్యుత్ బిల్లును కేంద్రం ఉప‌సంహ‌రించుకోవాల్సిందే

విద్యుత్ బిల్లును కేంద్రం ఉప‌సంహ‌రించుకోవాల్సిందే

కేంద్ర విద్యుత్‌ చట్టం చాలా ప్రమాద‌క‌ర‌మైంది
శాస‌న స‌భ‌లో సీఎం కేసీఆర్ వెల్ల‌డి

హైదరాబాద్‌: దేశ ప్రజలు, రైతులపై పెనుభారం మోపే విధంగా ఉన్న విద్యుత్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. విద్యుత్‌ బిల్లు ఉప‌సంహరణ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స‌భ‌లో విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదక‌ర‌మ‌న్నారు. కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తిని అడ్డంగా నరికే చట్టం ఇదన్నారు. కేంద్ర చట్టం అమ్మ‌ల్లోకి వ‌స్తే రాష్ట్రంలో 26లక్షల బోర్లకు మీటర్లు పెట్టాల్సి ఉంటుంద‌న్నారు. కేంద్ర విద్యుత్‌ బిల్లును పార్లమెంట్‌లో మేం వ్యతిరేకిస్తామ‌ని సీఎం చెప్పారు. విద్యుత్‌ రంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటేనే డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో అభివృద్ధి చెందుతాయన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img