Homeఫ్లాష్ ఫ్లాష్CM KCR: ప్ర‌తి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం.. సీఎం కేసీఆర్‌

CM KCR: ప్ర‌తి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం.. సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్: వ‌ర‌ద నీటి ప్ర‌భావానికి గురైన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌తి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సాయం మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు.

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.

దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

న‌గరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img