Homeహైదరాబాద్latest Newsఒకే వేదికపైకి సీఎం రేవంత్, కేటీఆర్.. ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ.. ఎప్పుడంటే..?

ఒకే వేదికపైకి సీఎం రేవంత్, కేటీఆర్.. ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ.. ఎప్పుడంటే..?

నిత్యం ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్ కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

spot_img

Recent

- Advertisment -spot_img