హీరో బాలకృష్ణకు రేవంత్ సర్కార్ బంపరాఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం. బాలయ్య సినీ స్టూడియో నిర్మాణానికి సిద్ధం కాగా.. అందుకు భూకేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న కేబినేట్ భేటీలో ఈ విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.