ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక బీఆర్‌ఎస్, కేసీఆర్‌గారిని లక్ష్యంగా చేసుకుని న్యాయపరమైన ఎత్తుగడలు వేయాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు అని కవిత అన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం సీఎం రేవంత్‌కు లేదు..కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు అని కవిత ఆరోపించారు. మేం అంత కేసీఆర్ సైనికులం తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చాం మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు అని ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు.