కేసీఆర్ మాట ఇచ్చి పదేళ్లలో రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6 నెలల్లోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ‘మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. సాకేతిక కారణాల వల్ల కొందరికి రూ.2 లక్షలలోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తాం’ అని సీఎం అన్నారు.