విదేశీ విద్యా నిధి పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే SC, ST, BC సంక్షేమ శాఖలు ఇందుకు సంబంధించిన ఫైల్ ను సీఎంఓకు పంపినట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫైల్ ను సీఎం రేవంత్ ఆమోదిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బీసీ లబ్ధిదారులను 300 నుంచి 800, ఎస్సీలను 210 నుంచి 500, ఎస్టీలను 100 నుంచి 500కు పెంచాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వపారా ఎంపికైన ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందనుంది.