తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సీఎం రేవంత్ చేరుకున్నారు. వేదపండితులు ఘన స్వాగతం పలికారు. స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసిననట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.