Homeహైదరాబాద్latest Newsఆడవారికి CM రేవంత్ మరో GOOD NEWS

ఆడవారికి CM రేవంత్ మరో GOOD NEWS

ఈరోజు ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన బడ్జెట్ను అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని సీఎం పేర్కొన్నారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని అధికారులను సీఎం కోరారు. అవసరం ఉన్నచోట సొంత భవనాలను నిర్మించేందుకు భూమిని గుర్తించాలని ఆదేశించారు.

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల్లో నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు బడ్జెట్ ను అంచనా వేయాలని తెలిపారు.

Recent

- Advertisment -spot_img