Homeహైదరాబాద్latest Newsగోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

ఇదే నిజం,శేరిలింగంపల్లి: రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామని మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వివరించారు. శనివారం గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీతో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎం బీసీ కార్పోరేషన్ ఛైర్మెన్ జేరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రఘునాథ యాదవ్, కార్పొరేటర్లు , నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img