Kerala : కేరళలోని వయనాడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి బిజీబిజీగా గడుపుతున్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ తరఫున ప్రచారం చేస్తూ అక్కడి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ బిజీగా ఉండటం వల్ల దేశంలోని కాంగ్రెస్ నాయకులు కేరళలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.