– ఆరుగ్యారెంటీలకు సంబంధించి అపోహలు వద్దు
– ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. అప్లికేషన్లను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అవసరమైనన్ని దరఖాస్తులను ప్రజాపాలనలో అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని, పాత లబ్దిదారులందరికీ కొనసాగుతాయని తెలిపారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు వీటికి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు