తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం అనే సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తాం..
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలను త్వరలోనే ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని వర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. నాణ్యమైన విద్య అందించి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు.