రంగారెడ్డి జిల్లా మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పోలీసు పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ విద్యనందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల సంక్షేమం కోసం ఆలోచించింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.భవిష్యత్తులో యువత సంక్షేమం కోసం మొదటగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న పోలీసులను అభినందించారు.