నేడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ఇండస్ట్రీ నిర్మాతలు, హీరోలు, దర్శకులు సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను గంట సేపు వెయిట్ చేయించారు. 10 గంటలకు వస్తాను అని చెప్పి 11 గం.లకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎం రాక కోసం ఇండస్ట్రీ పెద్దలు ఓపికగా వెయిట్ చేసారు. అయితే ఈ సమావేశంలో తను ఇండస్ట్రీ కి వ్యతిరేకం కాదని, రూల్స్ ఫోలో అవుతున్నా అని సీఎం రేవంత్ తెలిపారు. ఈ భేటీలో అల్లు అర్జున్ మీద నాకెందుకు కోపం ఉంటుంది..? అల్లు అర్జున్.. రామ్ చరణ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు.. నాతో కలిసి తిరిగారు అని రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే చట్టం ప్రకారం వ్యవహరించాలి అనేది నా విధానమన్న సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.