Vikarabad : సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పంక్చర్ అవడంతో కాన్వాయ్ ఒక్కసారిగా ఆగింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో వికారాబాద్ జిల్ల మన్నెగూడ్ వద్ద కారు టైర్ పంక్చర్ అయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.