Homeహైదరాబాద్latest Newsఅంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad : హైదరాబాద్ లోని రాయదుర్గం మహాప్రస్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి హాజరై భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపారు. మంగళవారం గుండెపోటుకు గురైన రాజీవ్ రతన్‌ను ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స చేస్తుండగానే మృతి చెందారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ సమర్థ అధికారిగా పేరొందారు.

Recent

- Advertisment -spot_img