ఇదేనిజం, శేరిలింగంపల్లి : నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( మే 12) ఉదయం ఫుట్ బాల్ ఆడేందుకు హెచ్‌సీయూ క్యాంపస్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి అటవిడుపుగా సీఎం ఫుట్ బాల్ ఆడారు. గ్రౌండ్ లో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడాకారుడిగా గోల్ చేసేందుకు ఇతర ఆటగాళ్లతో కలిసి పోటీపడడం అందరిని ఆశ్చర్యపరిచింది. పుట్ బాల్ ఆడుతుండగానే షూ పాడైపోవడంతో అవిలేకుండానే కొద్ది సేపు ఆటను కొనసాగించారు. సీఏం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్ సీ యూ ఎన్ఎస్ యూఐ నాయకులు, హెచ్ సీ యూ విద్యార్థులు ఫుట్ బాల్ ఆటలో పాల్గొన్నారు. సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టీశాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.