తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తన స్వగ్రామం కొండారెడ్డి పల్లికి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి దసరా వేడుకలకు హాజరయ్యారు. వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాలును ప్రారంభించారు.అనంతరం కోట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లికి చేరుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పెద్దఎత్తున కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు.