Homeహైదరాబాద్latest Newsరవాణా శాఖ నూతన లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

రవాణా శాఖ నూతన లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్స్‌ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలో రవాణా శాఖ నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ఆర్టీసీలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ ఉద్యమం సమ్మెలో ఆర్టీసీ కీలకంగా పని చేసింది అని అన్నారు. ఆర్టీసీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం అని సీఎం తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం అని అన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగింది అని ఆరోపించారు. తెలంగాణలో రవాణాశాఖను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.suk 6 ఇదేనిజం రవాణా శాఖ నూతన లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Recent

- Advertisment -spot_img