Homeహైదరాబాద్latest Newsతిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

నేడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత మొక్కులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ఎలాంటి హడావిడి లేకుండా వైకుంఠము క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లి, శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.

Recent

- Advertisment -spot_img