హైదరాబాద్ లో ఇవాళ, రేపు ‘గ్లోబల్ AI సమ్మిట్’ జరగనుంది. ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించనున్నారు. AI సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని ప్రభుత్వం పేర్కొంది. ‘ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో పని’ అనే థీమ్ తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో AI సంస్థలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సమాజం పై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్ల పై చర్చ జరగనుంది.