రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో శనివారం మాట్లాడుతూ.. రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు.