సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. బుధవారం వయనాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేవంత్ కేరళ వెళ్తున్నారు. ఇదే కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. కాగా ఇక్కడ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది.