ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నేడు (మంగళవారం) రెండో విడత రుణమాఫీ చేయనున్నది . ఇప్పటికే లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. లక్షన్నర వరకు రుణాలను నేడు మాఫీ చేయనున్నది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండో విడతలో లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ నగదును రైతుల రుణ ఖాతాల్లో జమచేస్తారు. లక్ష లోపు రుణమాఫీ వ్యవహారం కాస్త గందరగోళంగా సాగింది. తమకు అర్హత ఉన్నా రుణాలు మాఫీ కాలేదని చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రెండో విడుతలో భాగంగా చేయబోయే రుణమాఫీ అయినా సక్రమంగా విడుదల చేస్తారేమో వేచి చూడాలి.