Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ సంస్థలను అదానీకి అప్పిగించేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

విద్యుత్ సంస్థలను అదానీకి అప్పిగించేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

విద్యుత్ సంస్థలను అదానీకి అప్పిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు చేసే బాధ్యతను పైలెట్ గా అదానీకి అప్పగిస్తున్నామని జనవరిలో రేవంత్ రెడ్డి చెప్పారు అని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలని అని అన్నారు. చిన్న చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు.. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా? అని కేటీఆర్ నిలదీశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో రోజు అదానీని తిడుతాడు, తెలంగాణలో వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడు అని ఆరోపించారు. రాహుల్ గాంధీ అదానీని దుర్మార్గుడు, అవినీతిపరుడు అంటున్నాడు.. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న ఎంవోయూలు ఎందుకు రద్దు చేయడం లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కెన్యా దేశపు తలసరి ఆదాయం 2000 డాలర్లు.. అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 5000 డాలర్లు.. అలాంటి కెన్యా దేశపు అధ్యక్షుడు, అదానీ లంచగొండి అని తెలిసాక అతనితో వ్యాపారాలు రద్దు చేసాడు. కానీ రోజు అదానీని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానీతో ఎంవోయూలు ఎందుకు రద్దు చేసుకోలేదు కేటీఆర్ అని నిలదీశారు. కోహినూర్ హోటల్ లో అదానీకి, పొంగులేటికి జరిగిన రహస్య సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. ఈడీ దాడుల నుండి కాపాడుకోవడానికా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img