బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో బంధించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు బయటకు రాకుండా చూడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను శాసనసభకు రాకుండా అడ్డుకున్న తీరు సరికాదన్నారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ వేములవాడలో భోజనాల ఖర్చుపై కేటీఆర్ స్పందించారు. ‘సీఎం రేవంత్ విందులు, వినోదాలు.. రైతులకు జైళ్లు” అంటూ కేటీఆర్ నినాదాలు చేశారు.