యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అక్కడి పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు.