రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. కొన్ని చోట్ల స్కూళ్లలో టీచర్లు లేరని, మరికొన్ని చోట్ల విద్యార్థుల్లేరని బడులు మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైంది. ఇకపై రాష్ట్రంలో సింగిల్ టీచర్ బడుల్ని మూసి వేయం’’ అని చెప్పారు.