శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసారు. ప్రమాదం పట్ల సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్లాంట్ వద్ద పర్యావేక్షిస్తున్న సంబందిత మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉన్నతిధికారులకు సీఎం ఫోన్ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎటువంటి చర్యలైనా తీసుకునేందుకు వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఇక ప్రమాద స్థలంలో రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం 17 మంది సిబ్బందిలో ఇప్పటికే 8 మంది బయటకు రాగా 9 మంది కోసం సహాయక చర్యలు జరుగుతున్నాయి.