ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సిండికేట్లకు 3 వేలకు పైగా మెజారిటీ షాపులు ఇచ్చారంటే మీ పారదర్శకత, నిష్పక్షపాతం ఎంత గొప్పదో.. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. సామాన్యులను దుకాణాల్లోకి రానీయకుండా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరినైనా లాటరీ చిక్కితే, లైసెన్స్ ఇస్తారా..? లేక 30 శాతం కమీషన్ ఇస్తారా..? లేకుంటే చస్తారా..? అంటూ బెదిరించారు. . మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తామని బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారు. సీఎం గారు..! ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి? అని షర్మిలా ప్రశ్నించారు.