ఇదేనిజం, శేరిలింగంపల్లి: సీఎంఆర్ఎఫ్ పథకం అత్యవసర పరిస్థితిలో పేదలకు ఆపన్న హస్తంగా నిలుస్తున్నది శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం కి చెందిన బేబి ఆఫ్ ఆనమ్ ఫాతిమా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా మంజూరైన రూ.75 వేలు ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు చల్లా శోభన్ తదితరులు పాల్గొన్నారు.