– నేడు రావిర్యాల జడ్పీ హైస్కూల్లో ప్రారంభించనున్న కేసీఆర్
ఇదే నిజం, హైదరాబాద్: దసరా కానుకగా, అక్టోబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో అన్ని తరగతుల స్టూడెంట్లకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారైంది. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది స్టూడెంట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్కూల్ ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు.
అల్పాహారం మెనూ..
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ