సినీ ప్రముఖుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలను రద్దు చేసిందని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు.