Homeహైదరాబాద్latest Newsతెలంగాణ వాసులకు చల్లటి వార్త.. ఈ జిల్లాల్లో వర్షాలు..!

తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. ఈ జిల్లాల్లో వర్షాలు..!

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి మోస్తారు వర్షం పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఎర్రని ఎండలకు విసిగిపోయిన ప్రజలకు ఇది చల్లటి కబురు అనే చెప్పాలి. కాని ఉరుములు, మెరుపులు కూడా ఉండడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img