తెలంగాణలో రాబోయే 3 రోజులు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ సిటీలో రెండు రోజులు చలిగాలులు తీవ్రంగా ఉంటాయి. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు తీవ్రంగా పడుతుంది.