తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు చల్లని గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వారు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉదయం కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వారు తెలిపారు. చలి దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉబ్బసం, అలెర్జీలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.