ఇదే నిజం, ధర్మపురి (ఎండపల్లి): రుణమాఫీ కానీ రైతుల వివరాల సేకరణ ప్రారంభించినట్లు ఉమ్మడి వెల్గటూర్ మండలం గోడిసెలపేట ఏఈఓ సందీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో రేషన్ కార్డు లేని రైతుల నుండి పంట రుణమాఫీ కానీ రైతుల నుండి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ లు మౌనిక, సందీప్, అలేఖ్య పాల్గొన్నారు.